ఎరువుల యాజమాన్యం  

చివరి దుక్కిలో ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిపి దున్నాలి. 24 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నిచ్చే నత్రజని ఎరువును ౩ సమ భాగాలుగా చేసి 1/౩ వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/౩ వంతును 2 భాగాలుగా విత్తిన ౩౦వ మరియు 45 వ రోజున వేయాలి. సంకరజాతి రకాలను ఎరువుల మోతాదు సుమారు 5౦ శాతం పెంచి వేయాలి.